ఇండోర్‌లో ముంబయి విధ్వంసం..

218
Mumbai Indians thrash Kings XI Punjab
Mumbai Indians thrash Kings XI Punjab
- Advertisement -

ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 10లో భీకర ఫామ్‌లో ఉన్న ముంబయి వరుసగా ఐదో విజయం నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. బ్యాటుతో రెచ్చిపోయిన ముంబయి, గురువారం జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో పంజాబ్‌ను మట్టికరిపించింది. పార్థివ్‌ పటేల్‌ (37; 18 బంతుల్లో 4×4, 2×6)తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన బట్లర్‌ యథేచ్ఛగా రెచ్చిపోయాడు. పార్థివ్‌ కూడా తక్కువేమీ తినలేదు. ఇద్దరూ ఎడాపెడా బౌండరీలు బాదేడయంతో ముంబయి 5 ఓవర్లలోనే 68 పరుగులు చేసింది. పార్థివ్‌ ఔటైనా… నితీష్‌ రాణా వస్తూనే దంచుడు మొదలెట్టాడు.మోహిత్‌ శర్మ బౌలింగ్‌లో బట్లర్‌ ఔటైనా.. రాణా విధ్వంసం కొనసాగించాడు. హార్దిక్‌ పాండ్య (15 నాటౌట్‌)తో కలిసి లాంఛనం పూర్తి చేశాడు.

టాస్ ఓడీ బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఒపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. ఒపెనర్‌గా వచ్చిన షాన్ మార్ష్‌ ధాటిగా ఆడి 21 బంతుల్లో 26 పరుగులు చేశాడు. పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ హషీమ్‌ ఆమ్లా ఆటే హైలైట్‌. షాన్‌ మార్ష్‌ తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన అతడు చక్కని షాట్లతో అలరించాడు. విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అనంతరం పోలార్డ్ బౌలింగ్‌లో మెక్‌గ్లాన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు షాన్ మార్ష్‌. కీపర్ వృద్ధిమాన్ సాహా (11) తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. అనంతరం కెప్టెన్ మాక్స్‌వెల్‌ క్రీజులోకి రాగానే ఫోర్లు, సిక్సులతో ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 18 బంతుల్లో 40 పరుగులు చేసిన మాక్స్‌వెల్‌ బూమ్రా బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. అనంతరం వచ్చిన స్టోనీస్‌ మెక్‌గ్లాన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి పోలార్డ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత అమ్లా(60 బంతుల్లో 104) తన జోరు కొనసాగిస్తూ.. మలింగ వేసిన ఆఖరి ఓవర్లో రెండు వరుస సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో బుమ్రా, పాండ్యాలకు తలో వికెట్‌ దక్కగా.. మెక్‌గ్లాన్‌కు రెండు వికెట్లు దక్కాయి.

- Advertisement -