క్రికెట్ అభిమానులకు ఆద్యంతం ఉత్సాహాన్ని పంచే ఐపీఎల్ సీజన్ మరో 20 రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే అని జట్ల ఫ్రాంచైజీలు ముమ్మర కసరత్తులు చేస్తున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్ అభిమానులకు షాక్ ఇచ్చిన విషయం ఏదైనా ఉందా ? అంటే అది ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు. ముంబైకి ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ శర్మను పక్కన పెట్టి సారథ్య బాద్యతలను హర్ధిక్ పాండ్యకు అప్పగించింది జట్టు యజమాన్యం. దీనిపై ఇప్పటికీ కూడా రచ్చ జరుగుతూనే ఉంది. రోహిత్ శర్మ అభిమానులు ముంబై ఇండియన్స్ యజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే భవిష్యత్ ప్రణాళికలను దృష్టిలో ఉంచుకొని రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించి హర్ధిక్ పాండ్యను కెప్టెన్ గా నియమించినట్లు ముంబై యజమాన్యం చెప్పుకొచ్చింది. .
అయితే హర్ధిక్ కెప్టెన్సీలో ఆడేందుకు ముంబై జట్టులోని కొందరు ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆటగాళ్ల పట్ల కాస్త ఎగ్రెస్సివ్ గా ఉండే హర్ధిక్ కెప్టెన్సీపై చాలానే చాలా సందర్భాల్లో విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అందువల్ల రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ వంటివాళ్ళు హర్ధిక్ కెప్టెన్సీలో ఆడేందుకు అసౌకర్యంగా ఫిల్ అయ్యే ఛాన్స్ ఉందని క్రీడా విశ్లేషకుడు సంజయ్ మంజ్రేకర్ ఇటీవల వ్యాఖ్యానించాడు. అంతే కాకుండా హర్ధిక్ కెప్టెన్సీలో ముంబై టీం లయ తప్పే అవకాశం ఉందని అభిప్రాయ పడుతున్నారు. అయితే ముంబై జట్టుకు ఐదు ఐపీఎల్ టైటిల్స్ అందించిన రోహిత్.. ఈసారి ప్లేయర్ గా ఆ జట్టులో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ రోహిత్ పర్ఫామెన్స్ వీక్ గా ఉంటే టీంపై ఒత్తిడి పెరిగే అవకాశం లేకపోలేదు. మొత్తానికీ హిట్ మ్యాన్ ను కెప్టెన్సీ నుంచి తప్పించి ముంబై ఇండియన్స్ కొత్త చిక్కులు తెచ్చుకుందనే చెప్పాలి.
Also Read:సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్.. ‘బహుముఖం’