ఐపీఎల్ 2022 సీజన్‌లో ఈరోజు కీలకపోరు జరుగుతోంది. ఈ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు ముంబయిలోని వాంఖెడే స్టేడియం వేదికగా, టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ జట్టులో ఒక మార్పు చేసింది. లలిత్ స్థానంలో పృథ్వీ షా జట్టులోకి వచ్చాడు.
అటు, ముంబయి జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. స్టబ్స్ స్థానంలో డివాల్డ్ బ్రెవిస్ జట్టులోకి రాగా, సంజయ్ స్థానంలో షోకీన్ ను తీసుకుంది.కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ కు చేరుతుంది. ఢిల్లీ ఓడితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ప్లే ఆఫ్స్ లో అడుగుపెడుతుంది. అందుకే ఈ మ్యాచ్ లో ముంబయి జట్టు గెలవాలని బెంగళూరు కోరుకుంటోంది.
తుది జట్లు :
ముంబయి ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), తిలక్ వర్మ, రమణ్‌దీప్ సింగ్, డేవాల్డ్ బ్రెవిస్, టీమ్ డేవిడ్, డానియల్ సామ్స్, హృతిక్ సోకీన్, జస్‌ప్రీత్ బుమ్రా, రిలే మెరిడిత్, మయాంక్ మార్కండే
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్, రోవ్‌మన్ పొవెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్జ్, ఖలీల్ అహ్మద్