సొంతగడ్డపై సన్‌రైజర్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. బౌలర్లు సత్తాచాటినా.. బ్యాట్స్‌మెన్ విఫలమవడం ఆతిథ్య జట్టు కొంపముంచింది. శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబయి 40 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ను ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 20 ఓవర్లలో 7 వికెట్లకు 136 పరుగులే చేసింది. పొలార్డ్ (46 నాటౌట్; 26 బంతుల్లో 2×4, 4×6) మెరుపులతో ముంబయి ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. సన్‌రైజర్స్ బౌలర్లు సమష్టిగా సత్తాచాటి ముంబయిని కట్టడి చేశారు. అనంతరం సన్‌రైజర్స్ 17.4 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది.
ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) హుడా (బి) నబి 11; డికాక్ (సి) హుడా (బి) కౌల్ 19; సూర్యకుమార్ (ఎల్బీ) (బి) సందీప్; ఇషాన్ రనౌట్ 17; కృనాల్ (సి) బెయిర్‌స్టో (బి) కౌల్ 6; పొలార్డ్ నాటౌట్ 46; హార్దిక్ (సి) శంకర్ (బి) రషీద్ 14; రాహుల్ చాహర్ (సి) బెయిర్‌స్టో (బి) భువనేశ్వర్ 10; జోసెఫ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 6;
మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 136;
వికెట్ల పతనం: 1-21, 2-28, 3-43, 4-63, 5-65, 6-86, 7-97; బౌలింగ్: భువనేశ్వర్ 4-0-34-1; సందీప్‌శర్మ 3-0-20-1; నబి 4-0-13-1; యూసుఫ్ 1-0-8-0; కౌల్ 4-0-34-2; రషీద్ 4-0-27-1
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (బి) జోసెఫ్ 15; బెయిర్‌స్టో (సి) బుమ్రా (బి) రాహుల్ చాహర్ 16; విజయ్ శంకర్ (సి) హార్దిక్ (బి) జోసెఫ్ 5; పాండే (సి) రోహిత్ (బి) బెరెన్‌డార్ఫ్ 16; హుడా (బి) జోసెఫ్ 20; పఠాన్ (సి) ఇషాన్ కిషన్ (బి) చాహర్ 0; నబి (సి) రోహిత్ (బి) బుమ్రా 11; రషీద్ (సి) అండ్ (బి) జోసెఫ్ 0; భువనేశ్వర్ (బి) జోసెఫ్ 2; కౌల్ (సి) డికాక్ (బి) జోసెఫ్ 0; సందీప్‌శర్మ 5 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 6;
మొత్తం: (17.4 ఓవర్లలో ఆలౌట్) 96;
వికెట్ల పతనం: 1-33, 2-33, 3-42, 4-61, 5-62, 6-88, 7-88, 8-90, 9-91; బౌలింగ్: బెరెన్‌డార్ఫ్ 4-0-28-1; బుమ్రా 3-0-16-1; రాహుల్ చాహర్ 4-0-21-2; అల్జారి జోసెఫ్ 3.4-1-12-6; కృనాల్ పాండ్య 2-0-9-0; హార్దిక్ పాండ్య 1-0-7-0