మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ని కలిసిన ముంబై హకీ కోచ్ చంద్రశేఖర్..

161
srinivas goud
- Advertisement -

రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ని కలిశారు మాజీ ఇండియన్ హాకీ క్రీడాకారుడు, ముంబై హకి జట్టు కోచ్ N. చంద్రశేఖర్ . హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు అభినందించారు.

అనంతరం చంద్రశేఖర్ గారు హైదరాబాద్ లో మహిళల హాకీ అకాడమి ని ఏర్పాటు చేసి వందలమంది హాకీ క్రీడాకారులను తయారుచేయాలనే లక్ష్యం తో ఉన్నామన్నారు. ప్రస్తుతం ముంబయి హాకీ కోచ్ మరియు ముంబై స్కూల్ ఫెడరేషన్ సెక్రెటరీ గా సేవలు అందిస్తున్నామన్నారు.తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో తాండూరు MLA పైలెట్ రోహిత్ రెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ శ్రీ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి , తెలంగాణ మాస్టర్స్ హాకీ ప్రెసిడెంట్ యం. రఘునందన్ రెడ్డి, హాకీ క్రీడాకారులు రవి, దీప్ సింగ్, లకన్, రాజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -