ముమైత్‌కి అంతమందితో ఎఫైర్స్‌..!

140
Mumaith reveals about her affair

ముమైత్‌ ఖాన్‌. ఈ పేరు వినగానే తెలుగు ప్రేక్షకులకు ఊపొస్తుంది.  ఎందుకంటే..’ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే..’ అంటూ కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. అందుకే  ముమైత్‌ ఖాన్‌ ఆన్‌ స్ర్కీన్‌ మీద కనబడగానే  ఇంకా ఈ అమ్మడి వయసు నిండా పదహారే అనే రేంజ్‌ లో రెచ్చిపోతారు ప్రేక్షకులు.  పోకిరి సినిమాలో ఉన్న ఆపాటతో ముమైత్‌ ఎంత పాపులర్‌ అయిందో వేరే చెప్పక్కర్లేదు.

ఎక్కువగా ఐటెం సాంగ్స్‌ లో మెరుస్తూ..తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ముమైత్‌. ఇప్పటికీ ముమైత్‌ ని తెలుగు ప్రేక్షకులు గుర్తుపెట్టుకుంటూనే ఉన్నారు. అయితే.. ఈ భామ మాత్రం తెలుగులో ఆఫర్లు లేక విలవిలలాడుతోంది. అయితే..అప్ప‌ట్లో సొంత బ్యాన‌ర్ పెట్టి సినిమాలు తీస్తాన‌ని కూడా చెప్పుకుంది. కానీ.. అలాంటి ప్ర‌య‌త్నాలేవీ క‌నిపించ‌లేదు.
Mumaith reveals about her affair
ఇదిలా ఉంటే..తాజాగా ఓ టీవీచానెల్ ఇంట‌ర్వ్యూలో ముమైత్ ప్ర‌త్య‌క్ష‌మై త‌న లైఫ్‌లోని ఎఫైర్స్ గురించి ఓపెన్‌గా చెప్పి అందరికీ షాకిచ్చింది. ఇప్పటి వరకు ఈ అమ్మడు నలుగురితో సహజీవనం  చేసిందట.  ఈ విషయం ముమైత్‌ నోటే బయటపడింది. ఇవే కాకుండా ఇంకా చాలా విషయాల్లో ఓపెన్ అయింది.

”ఇప్పటి వరకు నలుగురితో సహజీవనం చేశాను. అయితే అవ‌న్నీ క్లోజ్డ్ ఎఫైర్స్‌. తొలి సహజీవనం నాలుగేళ్ల పాటు సాగింది. ఆ త‌ర్వాత బ్రేక‌ప్‌. మ‌లి సహజీవనం మూడున్నర ఏళ్లు. ఇక మూడో వ్యక్తితో రెండేళ్ల పాటు కలసి ఉన్నా. చిట్ట‌చివ‌రి ల‌వ్ కేవ‌లం ఏడాదిన్న‌ర‌లోనే ముగిసింది”.. అంటూ షాకిచ్చే నిజాలు చెప్పింది.
 Mumaith reveals about her affair
అంతేకాదు ఇకనుంచి ఎఫైర్స్‌కి దూరంగా ఉంటాన‌ని కూడా చెప్పింది. రియాలిటీలో చాలా స్నేహ‌శీలని, రొమాంటిక్‌గా, కేరింగ్‌గా ఉండ‌డం అల‌వాట‌ని చెప్పింది. ఇక‌నుంచి పిచ్చి వ్య‌వ‌హారాల‌కు దూరంగా ఉంటూ అన‌వ‌స‌రంగా డ‌బ్బు ఖ‌ర్చు చేయ‌న‌ని చెప్పుకొచ్చింది. మొత్తానికి కొన్ని వ్య‌వ‌హారాల‌కు దూరంగానే ఉండాని నలుగురితో సహజీవనం చేశాక ఈ  అమ్మడుకి తెలిసొచ్చిందన్నమాట..!