ముమైత్ రీఎంట్రీ అదుర్స్..!

240
Mumaith Khan Re enters Bigg Boss Telugu house
- Advertisement -

డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా బిగ్ బాస్ షో నుంచి బయటకువచ్చిన ముమైత్ ఖాన్‌ తిరిగి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.ముమైత్ రీ ఎంట్రీతో 13వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఇక ముమైత్ ఖాన్ లేకపోయిన ఆమెను తలచుకుంటూనే ఉన్నారు మిగిలిన సెలబ్రిటీలు. ఇంతలో ముమైత్ ఖాన్ వాయిస్ వినిపించడంతో బిగ్ బాస్ హౌస్ కుటుంబ సభ్యులకు ఎక్కడలేని ఆనందం వచ్చేసింది. ముమైత్ ఎక్కడున్నావ్ అంటూ వెతుకుతుండగానే ముమైత్ ఖాన్ బిగ్ బాస్ హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చేసి సూపర్ జోష్ నింపింది. ఇక రేపటి ఎపిసోడ్‌లో ఎలిమినేషన్ ఉండటంతో పాటు వీకెండ్‌లో ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తుండటంతో రేపటి ఎపిసోడ్ మరింత రంజుగా సాగనుంది.

ధనరాజ్ అడిగిన ప్రశ్నలకు శివబాలాజీ ఆశ్చర్యానికి గురయ్యారు.  మీరు అర్చనకు లైన్ వేస్తున్నారా? లేక హరితేజకు లైన్ వేస్తున్నావో నాకు తెలియడం లేదని ఇద్దర్లో ఎవరికి లైన్ వేస్తున్నావంటూ శివబాలాజీని డైరెక్ట్‌గా అడిగేశాడు ధనరాజ్. ఇక బిగ్ బాస్ హౌస్‌లో సింగర్ కల్పన ప్రవర్తన చాలా ఆశ్చర్యకరంగా ఉందని.. ఆమె ప్రతి కెమెరా దగ్గరకు వెళ్లి ఏదేదో మాట్లాడుతుందని ఈమె చేష్టలతో బిగ్ బాస్‌కు పిచ్చిఎక్కించేసేలా ఉందంటూ హేళన చేసింది అర్చన.

 Mumaith Khan Re enters Bigg Boss Telugu house
ఇక నెక్స్ట్ కెప్టెన్ కోసం పోటీపడుతున్న శివబాలాజీ, ప్రిన్స్, కల్పనలకు ‘చల్ చల్ గుర్రం’ టాస్క్‌ను ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో గెలిచిన వారికి కెప్టెన్ అయ్యే అవకాశం ఉంటుందని మిగిలిన కుటుంబ సభ్యులు వారికి వాటర్ అందిచాలని కండీషన్ పెట్టారు.

ఇప్పటివరకూ బిగ్ బాస్ హౌస్‌కి వచ్చినప్పటి నుండీ తన ఏడుపుతో చిరాకు రప్పించిన మధుప్రియ.. చల్ చల్ గుర్రం టాస్క్‌లో పోటీలో ఉన్న వారిలో జోష్ నింపేందుకు ‘ఒకటే జననం ఒకటే మరణం’ అంటూ సాంగ్‌ పాడి అదరగొట్టేసింది. కాగా చల్ చల్ గుర్రం టాస్క్‌లో వెన్ను నొప్పి కారణంతో శివ బాలాజీ ముందే డ్రాప్ అయిపోయాడు. ఇక కల్పన ఏ మాత్రం రాజీ పడకుండా ప్రిన్స్‌తో పోటీపడింది. చివరివరకూ ప్రిన్స్‌కి గట్టిపోటీ ఇచ్చిన కల్పన చల్ చల్ గుర్రం టాస్క్‌లో తలొంచకతప్పలేదు. ఈ సరదా టాస్క్‌లో విన్నర్‌గా నిలిచాడు ప్రిన్స్.

- Advertisement -