మల్టీప్లెక్స్‌లో సినిమా చూశారా…అయితే ఆ రోజు చూడండి

149
multiplex
- Advertisement -

సినిమా ల‌వ‌ర్స్‌కు గుడ్‌న్యూస్‌. కేవ‌లం రూ.75కే మ‌ల్టీప్లెక్స్‌లో సినిమా చూసే అవ‌కాశం రాబోతుంది. మల్టీప్లెక్స్ ఆసోసియేష‌న్ ఆఫ్ ఇండియా(ఎమ్ఐఏ) సెప్టెంబ‌ర్ 16న జాతీయ సినిమా దినోత్సవం నిర్వ‌హిస్తున్న‌ట్లు తాజాగా వెల్ల‌డించింది. ఈ క్ర‌మంలో దేశ‌వ్యాప్తంగా ఉన్న దాదాపు 4000వేల మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ల‌లో కేవ‌లం రూ.75కే సినిమా చూసే అవ‌కాశాల‌న్ని ప్రేక్ష‌కుల‌కు క‌ల్పిస్తుంది. చాలా మంది ప్రేక్ష‌కుల‌కు మ‌ల్టీప్లెక్స్‌లో సినిమా చూడాల‌ని ఆశ‌గా ఉంటుంది. కానీ టిక్కెట్ రేట్ల కార‌ణంగా వెన‌క‌డుగు వేస్తుంటారు. ఇక ఇప్పుడు వాళ్ళంద‌రూ సింగిల్ స్క్రీన్ థియేట‌ర్‌ల టిక్కెట్ రేట్ల కంటే స‌గం త‌క్కువ‌ ధ‌ర‌తోనే మ‌ల్టీప్లెక్స్‌లో సినిమా చూడోచ్చు.

మ‌ల్టీప్లెక్స్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా త‌న వ్యాపారాన్ని నిల‌బెట్టిన సినీ ప్రేక్ష‌కుల కోసం 75 రూపాయిల‌కే సినిమాను చూపించాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఆఫ‌ర్ సెప్టెంబ‌ర్ 16 ఒక్క‌రోజు మాత్ర‌మే ఉంటుంది. ఇక సెప్టెంబ‌ర్ 16న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, K3 కోటికొక్క‌డు, శాకిని డాకిని వంటి తెలుగు చిత్రాలను 75రూపాయ‌ల‌కే మ‌ల్టీప్లెక్స్‌లో చూడ‌వ‌చ్చు. వీటితో పాటుగా సెప్టెంబ‌ర్ 9న విడుద‌ల‌వుతున్న బ్ర‌హ్మ‌స్త్ర‌, ఒకే ఒక జీవితం, కెప్టెన్‌ సినిమాలు కూడా అదే ధ‌ర‌కు చూసే అవ‌కాశం ద‌క్క‌నుంది. ఇక మ‌ధ్య కాలంలో థియేట‌ర్ల‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుల సంఖ్య చాలా త‌గ్గింది.

- Advertisement -