ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు బాహుబలి2 సినిమాను చూశారు.. బాగుందన్నారు.. మరి ఇందులో న్యూసేముంది అనుకుంటే పొరపాటే.. రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మంగళవారం నాడు పార్టీకి చెందిన ముఖ్యులతో కలిసి బాహుబలి 2 సినిమా కోసం ఏకంగా థియేటర్‌నే బుక్ చేసుకున్నారు. లక్నోలోని ఓ సినిమాథియేటర్ ను ములాయం తాను సినిమా చేసేందుకు బుక్ చేసుకొన్నారు.తనకు సన్నిహితులను, సహచరులను మాత్రమే ఆయన సినిమాకు పిలిచారు. ఇంతవరకు బాగానే ఉంది.. ములాయం సినిమా చూస్తున్న ఫోటోతోనే వచ్చిపడింది చిక్కంతా.. ఈ ఫోటోలో ములాయం సింగ్ యాదవ్ తన సన్నిహితులతో కలిసి సినిమా చూస్తుంటే ఆయన వెనకే ఓ కమాండో నిలబడిన ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే.. మంగళవారం లఖ్‌నవూలోని గోమ్తినగర్‌లో ములాయం సింగ్ తన సోదరుడు శివపాల్ యాదవ్, అధికారులతో కలిసి దర్జాగా ఏసీ గదిలో కూర్చుని ‘బాహుబలి-2’ సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే వారి వెనక ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది నిలబడే ఉన్నారు. వారిలో ఒకరు ఎన్‌ఎస్‌జీకి చెందిన బ్లాక్‌క్యాట్ కమాండో ఉన్నాడు. మూడు గంటల పాటు.. దాదాపు సినిమా అయ్యేవరకు వారంతా నిలబడే ఉన్నారు. ఎన్‌ఎస్‌జీ కమాండోలు భారత్‌కి చెందిన 16 మంది వీవీఐపీలకు భద్రత కల్పిస్తున్నారు. అందులో ములాయంసింగ్ ఒకరు.
ఇంతకీ ఈ ఫోటో ఎలా వైరలైందంటే.. ప్రముఖ సీనియర్ పాత్రికేయుడు శ్రీనివాసన్ జైన్ తన ట్విటర్ ఖాతాలో ఈ ఫోటోను షేర్ చేస్తూ.. ‘కమాండో నిర్విరామంగా మూడు గంటల పాటు నిలబడ్డారు.సెక్యూరిటీ ప్రొటోకాల్‌లో అంత సేపు నిలబడటం సాధ్యం కాదు’ అని ట్వీట్ చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాకి ఎక్కడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. కేంద్ర వీవీఐపీ కల్చర్ తొలంగించాలనుకున్నప్పటికీ ములాయం లాంటి నాయకులే అవరోధాలుగా మారారని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. వాహానాల మీద బుగ్గలు తీసినంత మాత్రానా వీవీఐపీ కల్చర్ పోదని.. మన ఆలోచలన నుండి పోవాలని సూచించారు. కాగా, కమాండోల ప్రధాన బాధ్యత ఉగ్రవాదులను హతమార్చడమేనని వారిని వీఐపీలకి సెక్యూరిటీ నిమిత్తం పంపకూడదని గతంలో ఎన్‌ఎస్‌జీ హోంమంత్రికి లేఖ రాసింది.