సులువుగా అందరూ వేయగలిగే యోగాసనాలలో ముఖ స్వనాసనం కూడా ఒకటి. దీనినే పిరమిడ్ ఆసనం అని కూడా అంటారు. ఈ ఆసనం పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఈజీగా వేయవచ్చు. ఈ ఆసనం ప్రతిరోజూ వేయడం వల్ల ఎన్నో ప్రయోజనలు కలుగుతాయి. ముఖ్యంగా జ్ఞాపక శక్తి మందగించిన వాళ్ళు ఈ ఆసనం తప్పక వేయాలని యోగా నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ ఆసనంలో మెదడుకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. తద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే మెడనొప్పి, తల నొప్పి వంటి సమస్యలు కూడా ఈ ఆసనం వేయడం వల్ల దూరం అవుతాయి. కాబట్టి ముఖ స్వనాసనం ఎలా వేయాలి ? ఈ ఆసనం యొక్క ఉపయోగాలు ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం !
ముఖ స్వనాసనం వేయు విధానం
చదునైన నేలపై యోగా షీట్ వేసుకొని బోర్లా పడుకోవాలి. కాళ్ళు దగ్గరగా ఉంచుకొని చేతులు ముందుకు చాపాలి. ఆ తరువాత ఊపిరి పిల్చుకొని కాళ్ళు చేతులు పాదాలపై బ్యాలెన్స్ చేస్తూ నడుము భాగాన్ని పైకి లేపాలి. అప్పుడు చూడడానికి పిరమిడ్ ఆకారంలో కనిపిస్తుంది. ఇలా నడుము భాగాన్ని పైకి లేపే క్రమంలో కాళ్ళు మరియు వెన్నెముక ను నిటారుగా ఉంచాలి. ఈ భంగిమలో ఉన్నప్పుడూ శ్వాసక్రియ సాధారణ స్థితిలోనే జరపాలి. కొన్ని నిముషాలు ఈ భంగిమలో ఉన్న తరువాత నెమ్మదిగా సాధారణ స్థితిలోకి వచ్చి వజ్రాసనం వేయాలి.
ఉపయోగాలు
* వెన్నెముక శక్తి పుంజుకుంటుంది.
* జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది.
* ఒత్తిడి, ఆందోళన, టెన్షన్ వంటివి దూరం అవుతాయి.
* మనసు ప్రశాంతంగా మారుతుంది.
* కాళ్ళు, చేతులు దృఢంగా తయారవుతాయి.
సూచన : ఆస్తమా ఉన్న వాళ్ళు ఈ ఆసనం వేయరాదు.
Also Read:TRAI: ఓటీపీ మెస్సేజ్‌లు ఆలస్యం