విలన్ పేరు చెప్పగానే చాలా మందికి ఆయనే గుర్తుకు వస్తారు. రాయలసీమ విలన్ పాత్రలు అంటే ముందుగా గుర్తుకువచ్చేది ముకేశ్ రుషి(62). అంతగా తెలుగు ప్రేక్షకులను విలన్ పాత్రలతో మెప్పించారు. తెలుగు, హిందీ, పంజాబీ వంటి భాషలలో నటించారు. కానీ ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక కష్టాలు పడుతున్నారు. అవకాశాలు క్రమంగా తగ్గడంతో ఇక ఆయన బులితెరలోకి అడుగుపెట్టానున్నారు.
శ్రీమంతుడు సినిమాలో ఆయన చెప్పిన ‘దేవర కోటలో మామిడి తోట’ డైలాగ్ ఆ సినిమాకే హైలెట్ గా నిలిచింది. అత్తారింటికి దారేది, రామయ్య వస్తావయ్యా, రేసు గుర్రం వంటి చిత్రాలలో నటించారు. రేసు గుర్రంలో కడప పెద్దిరెడ్డి పాత్రలో అద్భుతంగా నటించారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించిన ఆయనకు వెండితెరలో అవకాశాలు తగ్గడంతో.. హిందీలోని ‘పృథ్వీ వల్లభ్ ‘ అనే సీరియల్ ద్వారా బుల్లితెరలోకి రంగప్రవేశం చేయనున్నారు.
సినిమా అంటే అని వర్గాలు ప్రేక్షకులు చూస్తారు.. కానీ సీరియల్ మహిళలలు మాత్రమే చూస్తారు. మరి మకేశ్ రుషి మహిళా ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో లేదో చూడాలి.