అంబానీ..మహాభారతం!

267
Mukesh Ambani Ready To Produce Mahabharat ..
- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ చిత్రం బాహుబలి. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు కలెక్షన్ల సునామీ సృష్టించింది. బాహుబలి తర్వాత పాంటసీ చిత్రాలకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా మహాభారతం సినిమా కొంతకాలంగా వార్తలు వెలువడుతునే ఉన్నాయి.

రాజమౌళి దర్శకత్వంలో మహాభారతం తెరకెక్కుతోందని వార్తలు వెలువడిన ఆయన కొట్టిపారేశారు. బాలీవుడ్ నటుడు అమీర్‌ ఖాన్‌,మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వేర్వేరుగా మహాభారతాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చిన అమీర్ ఖాన్…అందరికి నచ్చేలా సినిమా ఉండనుందన్నారు.

ఇక ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించేందుకు ముందుకొచ్చారు రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. అంతేగాదు నాలుగు లేదా ఐదు పార్ట్‌లుగా సినిమాను తీయనున్నారట.

మరోవైపు మోహన్ లాల్ సైతం తన కలల ప్రాజెక్టును రూ. 600 కోట్లతో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో మోహన్ లాల్ భీముడి పాత్రలో నటిస్తుండగా కర్ణుడి పాత్ర కోసం అక్కినేని నాగార్జునను సంప్రదించారు. 2020లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -