ముగిసిన బీఏసీ సమావేశాలు…

36
- Advertisement -

తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బీఏసీ సమావేశాలు ముగిసాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, శాసన సభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, వివిధ పార్టీ విపక్ష నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. శుక్రవారం గవర్నర్ స్పీచ్‌తో శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఫిబ్రవరి 4న గవర్నర్‌ ప్రసంగంపై ధన్యావాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. 5న ఆదివారం రోజున సెలవు కావడంతో 6వ తేదీన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. 7న రాష్ట్ర అసెంబ్లీకి సెలవు కావడంతో 8వ తేదీన బడ్జెట్‌ ప్రజా పద్దులపై చర్చలు జరుగుతాయని రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి నరసింహ చార్యులు ఒక ఉత్తర్వులో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి…

సీఎం కేసీఆర్‌పై తమిళి సై ప్రశంసలు..

విశ్వనాథ్..కీర్తి అజరామరం: సీఎం కేసీఆర్

5న కేబినెట్ భేటీ..

- Advertisement -