ముగ్గు….ముగ్గు పిండి

3
- Advertisement -

ముగ్గు పిండి అంటేనే బియ్యం పిండి. బియ్యం పిండి తప్ప ఇంకేదీ ముగ్గు పిండి అనబడదు…కానీ నేటి కాలం లో మన స్త్రీ మూర్తులు ముగ్గు కొరకు బియ్యం పిండి తప్ప అన్నీ వాడుతున్నారు…బియ్యం పిండి తో ముగ్గు వేయడం వల్ల ముగ్గు వద్దకు కిలకిల రావాలతో పిచ్చుకలు చేరి ఆ బియ్యం పిండిని ఆహారంగా స్వీకరిస్తాయి.

అలా పిచ్చుకలు ఆ పిండిని ఆహారంగా స్వీకరించడం ద్వారా పిచ్చుకలకు ఆహారాన్ని ఏర్పాటు చేసిన పుణ్యం దక్కుతుంది…పైగా సాంప్రదాయాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం కూడా…కని మన వాళ్ళు రాయి పిండి, సున్నం ఇంకా ఏవేవో కలిపి ముగ్గు కు అర్థం లేకుండా చేస్తున్నారు.

అలా పిచ్చి పిచ్చిగా కలపడం వల్ల సాంప్రదాయాన్ని మంటకలపడం అవుతుంది…బియ్యం పిండి అనుకుని పిచ్చుకలు వచ్చి తింటే వాటి ప్రాణాలను తీసిన వాళ్ళము అవుతాము.కాబట్టి ముగ్గును బియ్యం పిండితో నే వెయ్యండి. సంస్కృతి సంప్రదాయాలను కాపాడండి …పిచ్చుకలకు ఆహారాన్ని ఏర్పాటు చేసిన పుణ్యం దక్కించుకోండి…..సర్వే జనా సుఖినోభవంతు…సమస్త సన్మంగళాని సంతు.

Also Read:అధిక బరువుతో కిడ్నీలకు ఎఫెక్ట్..జాగ్రత్త!

- Advertisement -