జగన్‌ సమక్షంలో వైసీపీలోకి ముద్రగడ

28
- Advertisement -

కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. ఏపీలోని తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు జగన్. ముద్రగడతో పాటు ఆయన తనయుడు గిరి కూడా వైసీపీలో చేరారు.

కాపు సామాజికవర్గంలో గట్టి పట్టు ఉన్న నేత ముద్రగడ. ఆయన చేరికతో వైసీపీకి ప్లస్‌గా మారనుంది. ఇక ఈ సందర్భంగా మాట్లాడిన ముద్రగడ.. వైసీపీలో చేరడం సంతోషంగా ఉందని, రానున్న ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం పనిచేస్తానని చెప్పారు.పార్టీ అన్ని రకాలుగా రాజకీయంగా అండదండలుగా ఉంటుందని జగన్ ఈ సందర్భంగా చెప్పినట్లు తెలుస్తోంది.

Also Read:ఆర్‌ఎస్పీ గెలుపుకోసం కృషి చేద్దాం:నిరంజన్‌

- Advertisement -