ముద్రగడ పేరు మారింది!

14
- Advertisement -

పవన్ దెబ్బకు ముద్రగడ పద్మనాభం పేరు మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌ని ఓడించకపోతే పేరు మార్చుకుంటానని చెప్పిన ముద్రగడ…చెప్పినట్లుగానే తన పేరును ముద్రగడ పద్మరెడ్డిగా మార్చుకున్నారు. రిజిస్టర్ అధికారులు ముద్రగడ పద్మనాభం పేరును.. ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మారుస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.

ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు ముద్రగడ. ఆ తర్వాత పిఠాపురంలో పవన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. పవన్ ను ఓడిస్తానని శపథం చేయడమే కాదు ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని చెప్పారు. చెప్పినట్లుగానే తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు.

పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 70 వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి తో పాటు పలు శాఖలకు మంత్రిగా బాధ్యతలు సైతం చేపట్టారు.

Also Read:సన్నీ డియోల్‌తో గోపిచంద్!

- Advertisement -