పవన్ కు ముద్రగడ షాక్ ?

17
- Advertisement -

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తో జనసేన పార్టీకి ముప్పు పొంచి ఉందా అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2009 ఎన్నికల తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ముద్రగడ ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తారని గత కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఆయన జనసేన పార్టీలో చేరతారని, అందుకు సంబంధించిన కసరత్తులు జరుగుతున్నాయని గట్టిగానే గుసగుసలు వినిపించాయి. మొదట ఆయన వైసీపీలో చేరతారని టాక్ వినిపించినప్పటికి కాపు సామాజిక వర్గం దృష్ట్యా ఆయన జనసేనలో చేరడం గ్యారెంటీ అని భావించారంతా. ఆ మధ్య కొంతమంది జనసేన నేతలు కూడా ముద్రగడతో చర్చించారు. దాంతో త్వరలోనే ముద్రగడ మరియు పవన్ భేటీ అయ్యే అవకాశాలు కనిపించాయి. కానీ ఏమైందో తెలియదు గాని ఇద్దరి మధ్య సమావేశం జరగలేదు. .

ఇక తాజాగా ముద్రగడ పవన్ కు లేఖ రాశారు. ఈ లేఖను బట్టి చూస్తే ఆయన పూర్తిగా జనసేన పార్టీకి దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ” జనసేన పోటీ చేసే 24 స్థానాలకు తన అవసరం రాకూడదని, ఆ పార్టీతో కలిసి పని చేయాలని భావించినప్పటికీ పవన్ అవకాశం ఇవ్వలేదని..” ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. జనసేన పార్టీకి ఇతర సామాజిక వర్గాలతో పోల్చితే కాపు ఓటు బ్యాంకు అధికం. ఈ నేపథ్యంలో ముద్రగడ జనసేన పార్టీకి ప్రతికూలంగా వ్యవహరిస్తే కాపు ఓటు బ్యాంకులో చీలిక రావడం ఖాయమనేది విశ్లేషకులు చెబుతున్నా మాట. ఇక ప్రస్తుతం జనసేన పార్టీకి దూరంగా ఉంటున్న ముద్రగడ వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ముద్రగడ పద్మనాభం సడన్ గా జనసేన విషయంలో రివర్స్ కావడంతో ఆ పార్టీపై ఎలాంటి ప్రభావం పడనుందో చూడాలి.

Also Read:రేవంత్ సర్కార్.. దినదిన గండమేనా ?

- Advertisement -