Mudragada:జగన్ కోసమే పనిచేస్తా

16
- Advertisement -

జగన్ మోహన్ రెడ్డికి తోడుగా ఉండటానికే వచ్చానని తెలిపారు కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. తన కుతూరు చేసిన వ్యాఖ్యలను ఖండించిన ముద్రగడ..తన కుటుంబంలో చిచ్చు పెట్టారని మండిపడ్డారు.

తన కుటుంబంలో చిచ్చు పెట్టిన వ్యక్తికి ఆ భగవంతుడే శిక్ష విధిస్తాడని ..నా కూతురుతో కూడా నాపై తప్పుడు ప్రచారం చేయించారు. నా కుమార్తెకి ఎప్పుడైతే పెళ్లయిందో అప్పటి నుంచి తను నా ఆస్తి కాదు అని తెలిపారు. తాను భయపడే వ్యక్తిని కాదు, భయపడేది లేదు. నాకు ఎలాంటి పదవికాంక్ష లేదు అని తెలిపారు.

పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్‌కు మద్దతుగా నిలిచారు ముద్రగడ కుమార్తె క్రాంతి.

Also Read:ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం..

- Advertisement -