వచ్చేస్తున్న ‘ముద్దుల మొగుడు’ …

308
- Advertisement -

ప్రస్తుతం ఉన్న మాధ్యమాల్లో సోషల్‌ మీడియా అతి వేగంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. దీంతో టాలెంట్‌ ఉన్న నటీనటులు, దర్శకులు ఈ మాధ్యమం ద్వారా తమ ప్రతిభను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈమధ్యకాలంలో వెబ్‌ సిరీస్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు కొంతమంది కొత్త దర్శకులు. జబర్దస్త్‌ కార్యక్రమం ద్వారా ఎక్కువ ప్రేక్షకాదరణ పొందిన గెటప్‌ శ్రీను, అప్పారావు వంటి ఆర్టిస్టులతో నాగరాజ దండు ఓ వెబ్‌ సిరీస్‌ని ప్రారంభిస్తున్నారు.
  muddula mogudu web series starts from nov 24th
‘ముద్దుల మొగుడు’ పేరుతో హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సిరీస్‌ను తీర్చిదిద్దుతున్నారు. గౌతమ్‌ సమర్పణలో శ్రీ మురళీకృష్ణ ఆర్ట్స్‌ పతాకంపై పొన్నపాటి కృష్ణవేణి ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ‘ముద్దుల మొగుడు’ టైటిల్‌ రోల్‌ను గెటప్‌ శ్రీను పోషిస్తున్నారు. ఇటీవల నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి ఈ వెబ్‌సిరీస్‌ను ప్రారంభించారు.
   muddula mogudu web series starts from nov 24thనవంబర్‌ 24 నుండి ఓ యూ ట్యూబ్ ఛానల్ ద్వారా ‘ముద్దుల మొగుడు’ను వీక్షించవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా వున్న యూ ట్యూబ్‌ ప్రేక్షకులు ఈ వెబ్‌ సిరీస్‌ని ఆదరించి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నట్టు దర్శకుడు నాగరాజ దండు తెలిపారు.  గెటప్‌ శ్రీను, జబర్దస్త్‌ అప్పారావు, కాటంరెడ్డి, ఫన్‌బకెట్‌ భరత్‌, కౌశిక, దివ్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌కి కెమెరా: ఎస్‌.ఎస్‌.రాజు, సంగీతం: అజయ్‌ పట్నాయక్‌, సమర్పణ: గౌతమ్‌, నిర్మాత: పొన్నపాటి కృష్ణవేణి, దర్శకత్వం: నాగరాజ దండు.

- Advertisement -