ముచ్చటగా మూడోసారి గాయం…

34
- Advertisement -

ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో అరుణ్ విజయ్‌ షూటింగ్ ప్రమాదానికి గురయ్యారు. లండన్‌లో అచ్చం ఎన్బదు ఇళయై సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఆయన గాయపడ్డాడు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో అచ్చం ఎన్బదు ఇళయై ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో యేమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

మోకాళ్లకు అయిన గాయానికి కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటూ ‘ మోకాళ్లకు అయిన గాయానికి సాంప్రదాయ ఆయుర్వేద పద్ధతిలో చికిత్స చేయించుకుంటున్నాను. ఇది నా నాలుగో రోజు చికిత్స. షూటింగ్‌కి త్వరలో తిరిగి వస్తాను.’ అని అరుణ్‌ విజయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. ఈ సినిమా సందర్భంగా గతంలో రెండు సార్లు గాయపడ్డారు.

గతేడాది అక్టోబర్‌లో మోకాలికి గాయమవ్వగా…అదే యేడాది నవంబర్‌లో చేతులకు గాయం చేసుకున్నారు. దీంతో ఇది మూడో సారి గాయపడటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన తర్వాత అరుణ్‌ అభిమానులు త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. మరియు యాక్షన్ సీన్స్‌ సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

ఫిబ్రవరి 11..రుద్రుడు ఫస్ట్‌ సింగిల్‌

నెపో కిడ్‌ ట్రోల్స్ పై జాన్వీ రియాక్షన్

ఫిబ్రవరి 13…ఓరి వారి సాంగ్‌ విడుదల

- Advertisement -