భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. విరాట్ గురించి అనుష్క శర్మ ఎక్కడా బహిరంగంగా పెదవి విప్పనప్పటికీ.. వివాహ వేడుకలకి, విహార యాత్రలకి ఈ జంట వెళుతూ మీడియా కంట పడుతూనే ఉంది. తాజాగా ఈ ప్రేమపక్షులు ఈసారి న్యూయార్క్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. విరాట్.. అనుష్కతో కలిసి దిగిన సెల్ఫీని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ‘చాలా రోజుల తర్వాత నా ప్రేయసితో కాస్త విరామం కావాలి’ అని క్యాప్షన్ ఇవ్వడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..
నెటిజన్లు ‘విరుష్క’ చక్కటి జంట అంటూ తెగ లైకులు, కామెంట్లు పెడుతున్నారు. అనుష్క.. న్యూయార్క్‌లో జరగనున్న ఐఫా అవార్డుల కార్యక్రమం నిమిత్తం వెళ్లినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. జులై 15న న్యూయార్క్‌లోని మెట్‌లైఫ్ స్టేడియంలో ఐఫా ఈవెంట్ జరగబోతోంది. మరోవైపు విరాట్ వెస్టిండీస్ టూర్ ముగించుకుని అటు నుంచి యూఎస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఐఫా కార్యక్రమం పూర్తైన తర్వాతి రోజు అంటే జూలై 16న బాలీవుడ్ బిగ్గీస్ సమక్షంలో క్లోజింగ్ పార్టీని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఈ పార్టీకి విరాట్ కోహ్లి, అనుష్క శర్మ జంటగా హాజరవుతారని టాక్.
ఇక బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ(ఐఫా) -2017 కార్యక్రమం జూలై 14, 15 తేదీలలో అంగరంగ వైభవంగా జరగనుంది. 18వ ఎడిషన్ కి సంబంధించిన ప్రోగ్రాం న్యూయార్క్ లో జరగనుండగా, ఈ కార్యక్రమాన్ని కనివినీ ఎరుగని రీతిలో జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్ లైఫ్ స్టేడియంలో జరగనున్న ఐఫా వేడుకలో బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, అలియా భట్, కత్రినా కైఫ్ , షాహిద్ కపూర్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరియు కృతి సనన్, తదితరులు లైఫ్ పర్ ఫార్మెన్స్ ఇవ్వనున్నట్టు సమాచారం. అయితే ఐఫా కోసం బాలీవుడ్ సెలబ్రిటీలు గ్రూపులుగా చేరుకుంటున్నారు. ఇప్పటి వరకు షాహిద్ కపూర్, సైఫ్ అలీ ఖాన్, సల్మాన్ ఖాన్, సారా అలీ ఖాన్ , దిశా పఠానీ, అలియా భట్, వరుణ్ ధావన్, రణ్ భీర్ కపూర్ , కత్రినా కైఫ్ తదితర సెలబ్రిటీలు ఐఫా కోసం న్యూయార్క్ చేరుకోగా మరి కొందరు సెలబ్రిటీలు ఈ గురువారం అక్కడికి వెళ్ళనున్నట్టు సమాచారం.