MSK:దేశానికి శ్రీచరిణి రోల్ మోడల్

6
- Advertisement -

ఉమెన్స్ వరల్డ్ కప్ గెలుపులో తెలుగమ్మాయి కీలక పాత్ర పోషించడం గర్వంగా ఉంది అన్నారు భారత మాజీ ఆటగాడు ఎమ్మెస్కే ప్రసాద్. చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చిన శ్రీ చరిణి ఈరోజు ఈ స్థాయికి ఎదగడం చాలా గొప్ప విషయం అన్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు మహిళా క్రికెట్ టీమ్ క్రీడాకారిణి శ్రీ చరిణి.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెస్కే ప్రసాద్.. జై షా వచ్చిన తర్వాత మహిళా క్రికెట్ కు ఆదరణ పెరిగింది అన్నారు. దేశానికి శ్రీచరిణి రోల్ మోడల్… దేశంలో మొట్టమొదటి మహిళల క్రికెట్ అకాడమీని ఏపీలోనే ప్రారంభమైంది అన్నారు. ప్రతిభ ఉన్న అమ్మాయిలు ధైర్యంగా గ్రౌండ్స్ వచ్చి క్రికెట్ ఆడాలి అన్నారు.

ఉమెన్స్ వరల్డ్ కప్ లో శ్రీచరిణి ప్రదర్శన అద్భుతం అన్నారు మిథాలీ రాజ్. మహిళల క్రికెట్ కు మంచి ఆదరణ లభిస్తోంది… జిల్లా స్థాయి నుంచి మహిళా ప్లేయర్లను ఏపీ ప్రభుత్వం ప్రోత్సహించడం హర్షణీయం అన్నారు. ఉమెన్స్ కోసం ఏపీఎల్ నిర్వహించడం మంచి పరిణామం అన్నారు మిథాలీ రాజ్.

Also Read:Trump:త్వరలో భారత్‌కు వస్తా

- Advertisement -