మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు (MSG)’ వచ్చే సంవత్సరం సంక్రాంతికి భారీగా విడుదలకు సిద్ధమవుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా నయనతార నటిస్తోంది.
ఇప్పటికే విడుదలైన మొదటి పాట ‘మీసాల పిళ్ల’ కు వచ్చిన అద్భుతమైన స్పందన తర్వాత, చిత్రయూనిట్ రెండో సింగిల్ ‘శశిరేఖ’ విడుదల తేదీని ప్రకటించింది. ఈ పాటను డిసెంబర్ 8, 2025 న విడుదల చేయనున్నట్లు తెలిపారు.
కాగా, పాట ప్రొమోను డిసెంబర్ 6, 2025 న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి–నయనతారలతో ఉన్న రంగుల పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పాటను భీమ్స్ సిసిరోలియో స్వరపరిచారు. భాను కొరియోగ్రఫీ చేసిన ఈ పాటను కేరళలో చిత్రీకరించారు. చిరంజీవి స్టెప్పులు ఈ పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం.
Also Read:నెల్లూరు జిల్లాపై దిత్వా తుఫాన్ ఎఫెక్ట్..
ఇటీవల చిత్రం కోసం చిరంజీవి–వెంకటేష్‌లతో ప్రత్యేక పాటను కూడా చిత్రీకరించారు. షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేథరిన్ ట్రెసా, వీటీవీ గణేష్, రేవంత్ వంటి నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

