MSG:ఓటీటీలో చిరు రికార్డులు బ్రేక్!

6
- Advertisement -

థియేటర్లలో సూపర్ హిట్‌గా నిలిచిన సంక్రాంతి విజేత చిత్రం “మన శంకర వర ప్రసాద్ గారు” ఫిబ్రవరి 11, 2026న జీ5లో విడుదలైంది. విడుదలైన మొదటి రోజే అంచనాలను మించి అద్భుతమైన స్పందన అందుకుంది.

ఈ చిత్రం కేవలం 24 గంటల్లోనే 200 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను నమోదు చేసి జీ5 ప్లాట్‌ఫారమ్‌లో కొత్త రికార్డు సృష్టించినట్లు ఓటిటి సంస్థ సంతోషంగా ప్రకటించింది. ఈ డిజిటల్ దూకుడు ఇకముందూ కొనసాగుతుందని భావిస్తున్నారు.

ఈ ఎంటర్‌టైనర్ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. నయనతార, వెంకటేష్, సచిన్ ఖేడేకర్, కేథరిన్ ట్రెసా, జరినా వహాబ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. భీమ్స్ సెసిరోలియో సంగీతం మరియు నేపథ్య సంగీతాన్ని అందించారు.

Also Read:12 ఏళ్ల టీ20 రికార్డు బ్రేక్!

- Advertisement -