మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’.ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం తొలి రోజు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. తొలిరోజు (పెయిడ్ ప్రీమియర్లతో సహా) దాదాపు రూ.75 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. టాలీవుడ్ సీనియర్ హీరోల చిత్రాల్లో ఇది రెండో అతిపెద్ద ఓపెనింగ్‌గా నిలిచింది. ఈ జాబితాలో తొలి స్థానంలో కూడా చిరంజీవి సినిమానే ‘సై రా నరసింహారెడ్డి’ ఉండటం విశేషం. .
ఇవి కేవలం ప్రారంభ అంచనాలు మాత్రమే. ఖచ్చితమైన కలెక్షన్లపై పూర్తి స్పష్టత రావాలంటే అధికారిక గణాంకాల కోసం వేచి చూడాల్సి ఉంటుంది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కోనిడెల నిర్మించారు.
ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార నటించగా, కేథరిన్ ట్రెసా, హర్షవర్ధన్, అభినవ్ గోమటం, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించారు. అలాగే వెంకటేష్ ప్రత్యేక అతిథి పాత్రలో (కేమియో) ప్రేక్షకులను అలరించారు.
Also Read:KTR:కాంగ్రెస్ పార్టీ పతనం తప్పదు

