ప్రస్తుతం భారతీయ సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా మూవీల హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలో భారీ ప్రాజెక్టులతో వచ్చేందుకు సిద్ధమవుతున్నారు నిర్మాత ఎంఎస్ రాజు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సినిమాలను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు.
గతంలో శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి క్లాసిక్ హిట్స్ అందించారు ఎంఎస్ రాజు. ఇప్పుడు ఆ బ్యానర్‌ను మళ్లీ ప్రతిష్టాత్మకంగా నిలబెట్టేందుకు భారీ ప్రాజెక్టులను సిద్ధం చేస్తున్నారు.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం రెండు భారీ పాన్-ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాల్లో తన బ్యానర్ ద్వారా స్టార్‌డమ్ సాధించిన ఇద్దరు టాప్ హీరోలు నటించనున్నారని తెలుస్తోంది. అయితే, వారి పేర్లు ఇంకా ప్రకటించలేదు. ఈ రెండు సినిమాలలో ఒకటి భక్తి-హార్రర్ మూవీ. ఇది ఐదు భాషల్లో విడుదల కాబోతోంది.
ఈ ప్రాజెక్టుల గురించి అధికారిక ప్రకటన మే 10న, ఎమ్.ఎస్. రాజు పుట్టినరోజు సందర్భంగా వెలువడనుంది. కమర్షియల్ బ్లాక్‌బస్టర్లను రూపొందించే తన నైపుణ్యంతో, ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలను అందించే తన శైలితో, ఈ రీఎంట్రీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Also Read:ఎండలు..15 జిల్లాలకు అలెర్ట్!