ధోని టీ20లకు పనికిరాడు..

190
MS Dhoni Not A Good T20 Player
- Advertisement -

కెరీర్‌లో సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌గా కొనసాగిన మహేంద్రసింగ్ ధోని కొంతకాలం సరైన ఫాం లేకుండా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో పుణే జట్టు యాజమాన్యం నుంచి వస్తున్న విమర్శలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ధోనికి మరోదెబ్బ తగిలింది. భారత మాజీ కెప్టెన్ గంగూలీ … ధోని ఆటతీరుపై హాట్ కామెంట్స్ చేశాడు.

మహేంద్రసింగ్‌ ధోని టీ20ల్లో ఏమంత గొప్పగా ఆడట్లేదని …ధోని టీ20ల్లో మెరుగైన ఆటగాడని నేను అనుకోనని వ్యాఖ్యానించాడు. వన్డేల్లో అతను ఛాంపియనే కానీ.. టీ20ల విషయానికొస్తే గత పదేళ్లలో అతను కేవలం ఒకే ఒక్క అర్ధశతకం సాధించాడు. ఇదేమంత గొప్ప రికార్డు కాదు’’ అన్నాడు. ఈ ఐపీఎల్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ధోని విఫలమైన నేపథ్యంలో గంగూలీ ఈ వ్యాఖ్యలు చేశాడు.

అలాగే ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టు ఎంపిక విషయంలో కూడా గంగూలీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత ఫామ్ ను బట్టి తనైతే ధోనీని ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయను అని ఈ మాజీ క్రికెటర్ వ్యాఖ్యానించాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో మొదటి మూడు మ్యాచ్ లలోనూ సత్తా చాటలేకపోయిన ధోనీ… మిగిలిన మ్యాచ్ లలో రాణించి మంచి స్కోర్లు సాధిస్తే ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయవచ్చని గంగూలీ అన్నారు. అలాగే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ క్లార్క్ కూడా గంగూలీ అభిప్రాయంతో ఏకీభవించాడు. ధోనీ సత్తా చాటాలన్నాడు.

- Advertisement -