ధోనికి బాసటగా కపిల్

251
dhoni kapil
- Advertisement -

టీమిండియాలో ధోని ఆటతీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోనికి బాసటగా నిలిచారు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్.ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కపిల్‌..ధోని నుంచి అంతా ఏం ఆశీస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. ఎమ్మెస్ 20 లేదా 25 ఏళ్ల కుర్రోడు కాదని తెలిపారు.

20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆయన జట్టుకి ఎన్ని సేవలు చేశారో ఎంత బాగా ఆడారో మనమంతా చూశామని కానీ ఇప్పుడు అతడి నుండి అదే స్థాయి ఆటను ఆశీంచడం తప్పె అవుతుందన్నారు. అయితే ధోనికి ఉన్న అపార అనుభవం టీమిండియాకు సాయపడవచ్చారు. టీమిండియాకు దొరికిన ఆణిముత్యం ధోని అని కెప్టెన్‌గా క్లిష్ట సమయాల్లో జట్టును విజయాల బాటలో నడిపించారని చెప్పారు.

ప్రస్తుతం టీమిండియాలో మంచి ఆటగాళ్లున్నారన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే ఓవర్సీస్‌లో టీమిండియా సులభంగా గెలుస్తుందన్నారు. అనుభవం, టాలెంట్‌ కలిస్తే విరాట్ కోహ్లీ అని ప్రతిభ,కష్టపడే తత్వం ఆయన స్వభావం అన్నారు. మ్యాచ్‌ గెలవడం, ఓడిపోవడం అనేది విషయం కాదని ఎలా ఆడారన్నదే ముఖ్యమన్నారు.

- Advertisement -