పాక్‌ క్రికెటర్లతో ధోని…ఆసియా ఎలెవన్ వర్సెస్ వరల్డ్ ఎలెవన్

664
dhoni
- Advertisement -

కొంతకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తిరిగి బ్యాట్ పట్టనున్నాడు. ఐపీఎల్ 2020 ముంగిట పాకిస్ధాన్, బంగ్లాదేశ్,శ్రీలంక క్రికెటర్లతో ఆసియా ఎలెవన్‌ టీమ్‌లో ఆడనున్నాడు ధోని.

ఆసియా ఎలెవన్ వర్సెస్ వరల్డ్ ఎలెవన్ జట్ల మధ్య రెండు టీ20ల సిరీస్‌ని వచ్చే ఏడాది మార్చి 18 నుంచి 21 వరకూ నిర్వహించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) షెడ్యూల్‌ని రూపొందించింది. ఈ సిరీస్‌లో ధోని ఆడేందుకు అనుమతిచ్చింది బీసీసీఐ.

2007లో పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ క్రికెటర్లతో కలిసి టీమ్‌గా ఏర్పడి టీ20 సిరీస్ ఆడిన ధోనీ.. మెరుపు శతకంతో చెలరేగాడు. దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ ధోనీ ఆ దేశ క్రికెటర్లతో కలిసి రెండు టీ20లు ఆడనున్నాడు.

ఈ టీ20 సిరీస్ కోసం ధోనీతో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజా రూపంలో మొత్తం ఏడు మంది ఆడనున్నారు. అయితే ధోనీ మినహా మిగిలిన ఆరు మంది క్రికెటర్ల విషయంలో బీసీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

Bangladesh Cricket Board has sought permission from BCCI to allow 7 of its top cricketers, including MS Dhoni, to be part of an Asia XI invitational team

- Advertisement -