స్పాట్ ఫిక్సింగ్ వివాదంతో రెండు సంవత్సరాల పాటు ఐపీఎల్‌కు చెన్నై సూపర్ కింగ్స్ దూరమైన విషయం తెలిసిందే. రెండు సంవత్సారాల తర్వాత రంగంలోకి దిగిన చెన్నై వరుస విజయాలను నమోదు చేసుకుంటుంది. నిన్న (శనివారం) పుణేలో ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడగా ఈ మ్యాచులో ముంబయిపై తొలిసారిగా ఓటమిపాలైంది. వరుస విజయాలతో కొనసాగిస్తున్న చైన్నైకి ఈ ఓటమితో చెక్ పెట్టినట్లైంది. మొదటగా బ్యాటింగ్ దిగిన చెన్నై నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగుల చేసింది. ఈ తర్వాత బ్యాటింగ్ దిగిన ముంబయి ఇండియన్స్ రెండు బంతులుండగానే నాలుగు వికెట్లు కోల్పయి ఈ సీజన్‌లో చెన్నై పై తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ మ్యాచులో చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
ఇప్పటి వరకూ జరిగిన ఐపీఎల్ లో మ్యాచుల్లో 150 మ్యాచులకు కెప్టెన్సీ వహించిన ఏకైక ఆటగాడిగా ధోనీ ఈ ఘనతను సాధించాడు. తాను కెప్టెన్సీ వహించిన 150 మ్యాచుల్లో 88 మ్యాచులో గెలిచి అందరి కెప్టెన్‌ల కంటే ముందు వరుసలో ఉండటం విశేషం. ఇక ఈ సిజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన ఏడు మ్యాచుల్లో రెండు ఓడిపొయి ఐదు మ్యాచులు గెలిచి పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది.