ఆస్ట్రేలియా గడ్డపై ధోని అరుదైన రికార్డు..

311
MS Dhoni
- Advertisement -

భారత జట్టు సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఆస్ట్రేలియా గడ్డపై అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో ధోని (87 నాటౌట్‌ : 114 బంతులు, 6ఫోర్లు) హాఫ్‌ సెంచరీ సాధించి భారత విజయంలో కీలక పాత్రపోషించించాడు.

MS Dhoni

ఆస్ట్రేలియాతో తొలిసారి ద్వైపాక్షిక వన్డే సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన ఎమ్మెస్ ధోనీ.. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. మూడో వన్డేలోనూ 87 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన మహి.. ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన నాలుగో ఇండియన్‌గా ధోనీ నిలిచాడు.

అంతకుముందు సచిన్, కోహ్లి, రోహిత్‌శర్మ ఆస్ట్రేలియాలో ఈ మార్క్ అందుకున్నారు. మూడో వన్డేకు ముందు ఈ ఘనత అందుకోవడానికి ఎమ్మెస్ 36 పరుగుల దూరంలో ఉన్నాడు. చేజింగ్‌లో రెండో వికెట్ పడగానే క్రీజులోకి వచ్చిన ధోనీ.. రికార్డు అందుకోవడంతోపాటు టీమ్‌నూ గెలిపించాడు. ఈ సిరీస్‌లో ధోనీ మొత్తం 193 పరుగులు చేశాడు.

- Advertisement -