- Advertisement -
ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి సుధాకర్ కరోనా నుంచి కొలుకోవాలంటూ నెల్లూరు జిల్లా కావలిలో మృత్యుంజయ హోమం నిర్వహించారు. కావలి పాతశివాలయంలో బీజేపీ నేతలు, పసుపులేటి అభిమానులు ఈ కార్యక్రమం చేపట్టారు.
నెల్లూరు జిల్లా వాసిగా దేశానికే సేవ చేస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఓబీసీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి సుధాకర్ లు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుకున్నారు. అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
- Advertisement -