టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ టైమ్ నడుస్తోంది. ఆమె డేట్స్ కోసం నిర్మాతలు ఎదురుచూస్తున్న పరిస్థితి. నాని ‘హాయ్ నాన్న’ సినిమాలో ఆమె నటన గురించి ఇండస్ట్రీలో ఆఫ్ ది రికార్డుగా కొన్ని ముచ్చట్లు మాట్లాడుకుంటున్నారు. మరో సాయి పల్లవి అన్న రేంజ్ లో మృణాల్ ఠాకూర్ నటన ఉందని.. ఆమె కచ్చితంగా త్వరలోనే నెంబర్ వన్ పొజిషన్ కి వస్తోందని టాక్ నడుస్తోంది. నిజానికి సీతారామం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ మంచి పాజిటివ్ ఇంపాక్ట్ చూపించింది. వాస్తవానికి గతంలో హిందీలో అడపాదడపా కొన్ని సినిమాలు చేసింది ఈ భామ.
కానీ, బాలీవుడ్ లో అనుకున్నంతగా మృణాల్ ఠాకూర్ కి వర్కౌట్ అవ్వలేదు. ఆ దశలో హిందీ సీరియల్స్ లో కూడా నటించింది. మళ్లీ మధ్యలో గ్యాప్ తీసుకుంది. అయితే సడెన్ గా ఈ భామ కెరీర్ తెలుగులో అద్భుతంగా యూ టర్న్ అయింది. ఈమెకు వరసగా తెలుగులో అవకాశాలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ – సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓజి చిత్రంలో కూడా ఇప్పుడు ఓ కీలక పాత్రలో మృణాల్ ఠాకూర్ తీసుకున్నారు. ఈ సినిమాలో ఆమెది ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే హీరోయిన్ పాత్ర. సినిమా మొత్తం మృణాల్ ఠాకూర్ పాత్ర చుట్టే తిరుగుతుందట.
రీసెంట్ గా నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అనౌన్స్ అయిన సరిపోదా శనివారం చిత్రంలో కూడా మృణాల్ ఠాకూర్ రెండో హీరోయిన్ గా నటిస్తోందని టాక్. నాని సరసన ఇప్పటికే హాయ్ నాన్న సినిమాలో మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. వెంటనే మరో సినిమాలో కూడా నానికి జోడిగా మృణాల్ ఠాకూర్ కనిపించబోతుంది. అలాగే బుచ్చిబాబు – రామ్ చరణ్ సినిమాలో కూడా మృణాల్ ఠాకూరే హీరోయిన్ అంటున్నారు. అన్నట్టు మరో క్రేజీ ప్రాజెక్ట్ ను ఈ భామ చేజిక్కించుకుందని తెలుస్తోంది. రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో సినిమా రీసెంట్ గా లాంచ్ అయింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ దాదాపు కన్ఫర్మ్ అయినట్లే. మొత్తానికి మృణాల్ ఠాకూర్ కెరీర్ జెడ్ స్పీడ్ లో వెళ్తుంది.
Also Read:Congress:కాంగ్రెస్ కేరాఫ్ అరడజన్ దొంగలు!