ఎన్టీఆర్‌ 30లో సీతా!

124
mrunal
- Advertisement -

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్‌లో ఇది 30వ సినిమా కాగా త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే దానిపై రోజుకో వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

తొలుత బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌ను తీసుకోవాలని భావించిన తాజాగా ఆమె స్థానంలో సీతా రామం ఫేమ్ మృణాల్ ఠాకూర్‌ని తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీతారామంలో మృణాల్ పర్ఫార్మెన్స్‌కు యావత్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

దీంతో తారక్ సరసన మృణాల్ అయితే బాగుంటుందని కొరటాల భావిస్తున్నారట. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్‌గా మారింది.

- Advertisement -