‘మిస్టర్ సి.. నువ్వు నిజమైన హీరోః ఉపాస‌న

303
upasana-konidela
- Advertisement -

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తాజాగా న‌టిస్తోన్న సినిమా విన‌య విథేయ రామ‌. మాస్ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను ఈచిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రం ట్రైలర్ లోని యాక్షన్ సీన్ లో రామ్ చరణ్ అదరగొట్టాడు. ఈసినిమాపై భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. సంక్రాంతి కానుక‌గా ఈనెల 11న ఈమూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ఈసినిమా కోసం రామ్ చ‌ర‌ణ్ చాలా క‌ష్టప‌డ్డాడ‌ని ట్రైల‌ర్ చూస్తే అర్ధ‌మైపోతుంది. ఈచిత్రంలోని కొన్ని ఫైట్స్ సీన్స్ కోసం రామ్ చ‌ర‌ణ్ చాలా క‌ష్ట‌ప‌డ్డాడ‌ని చెబుతోంది అత‌ని భార్య ఉపాస‌న కొణిదెల‌.

charan upasana

ఈ చిత్రంలో ఓ యాక్షన్ సన్నివేశం కోసం సిద్ధమవుతున్న రామ్ చరణ్ ఈ వీడియోలో కనిపించాడు. చిత్రంలో క‌ష్ట‌మైన యాక్ష‌న్ సీక్వేన్స్ కు ముందు చ‌ర‌ణ్ వ‌ర్కవుట్ చేశాడ‌ని తెలిపింది. ఆ స‌మ‌యంలో అక్క‌డ వాతావ‌ర‌ణం చాలా చ‌ల్ల‌గా ఉన్న కూడా ఆయ‌న ఒంటిపై చొక్కా లేకుండా వ‌ర్క‌వుట్ చేశార‌ని తెలిపింది. చరణ్ కు కంపెనీ ఇచ్చిన కనల్ కన్నన్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ట్వీట్ చేసింది.

- Advertisement -