చియాన్ విక్రమ్‌ ‘మిస్టర్ కెకె’ సెన్సార్ పూర్తి

470
mr k k.jpeg
- Advertisement -

శివ‌పుత్రుడు, అప‌రిచితుడు చిత్రాల‌తో తెలుగు లో స్టార్ ఇమేజ్ ని సోంతం చేసుకున్న చియాన్ విక్ర‌మ్ క‌థానాయ‌కుడిగా అక్ష‌ర‌హ‌స‌న్‌, అభిహ‌స‌న్ కీల‌క పాత్ర‌ల్లో రాజేష్ ఎం సెల్వ ద‌ర్శ‌క‌త్వం లో త‌మిళం లో రాజ్‌క‌మ‌ల్ ఫిల్మ్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ నిర్మాణం లో ట్రైడెంట్ ఆర్ట్స్ కె.ర‌విచంద్ర‌న్ బ్యాన‌ర్ పై రూపోందిన క‌ద‌ర‌మ్ కొండ‌న్ చిత్రాన్ని తెలుగు లో నిర్మాత‌లు టి.న‌రేష్ కుమార్‌, టి. శ్రీధ‌ర్ లు సంయుక్తంగా టి.అంజ‌య్య స‌మ‌ర్ప‌ణ లో ఉత్త‌మాభిరుచి గ‌ల నిర్మాణ సంస్థ పారిజాత మూవీ క్రియెష‌న్స్ బ్యాన‌ర్ పై విడుద‌ల చేస్తున్నారు.

తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు/ఎ సర్టిఫికెట్ పొందింది. జూలై 19న ప్రేక్షకుల ముందుకురానున్న ఈ చిత్రంపై విక్రమ్ భారీ ఆశలు పెట్టుకున్నారు.

తెలుగు లో మిస్ట‌ర్ కెకె అనే టైటిల్ ని ఎనౌన్స్ చేయ‌గానే సోష‌ల్ మీడియా నుండి సామాన్య ప్రేక్ష‌కుడి వ‌ర‌కూ హ్యూజ్ రెస్పాన్స్ రావ‌టం తో ట్రేడ్ లో ఈ సినిమా పై భారీ అంచ‌నాలు పెరిగాయి. అయితే ఈ రోజు మిస్ట‌ర్ కెకె ట్రైల‌ర్ ని విడుద‌ల చేశారు. లోక‌నాయ‌కుడు ప‌ద్మ‌భూషణ్ క‌మ‌ల్‌హ‌స‌న్ త‌మిళ ట్రైల‌ర్ ని విడుద‌ల చేయ‌గా, అక్ష‌ర హ‌స‌న్ తెలుగు వెర్ష‌న్ ట్రైల‌ర్ ని విడుద‌ల చేశారు. స‌మ‌ర్దుడైన క‌మాండ‌ర్ గా విక్ర‌మ్ యాక్ష‌న్ ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తారని చిత్రయూనిట్ భావిస్తోంది.

- Advertisement -