త్వరలో పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు తేదీ ఖరారు..

325
MPTC, ZPTC Election Votes
- Advertisement -

రాష్ట్రంలో సోమవారం (మే 27) జరగాల్సిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇటీవల మూడు దశల్లో జరిగిన పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపును వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) గత శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి ఓట్ల లెక్కింపు తేదీపై నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్టు తెలిపింది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ జారీ చేసింది. 2018 పంచాయతీరాజ్ చట్టంలోని 147, 176 సెక్షన్లకు సవరణలు చేసింది. అక్రమాలు, పిరాయింపులకు ఆస్కారం లేకుండా చట్టాన్ని సవరణ చేశారు. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు మార్గం సుగమమైంది. ప్రమాణం చేయకుండానే ఎంపీటీసీలు మండల అధ్యక్షులను, జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్‌లను ఎన్నుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో త్వరలోనే ఓట్ల లెక్కింపునుకు తేదీలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం లభించింది.

- Advertisement -