తెలంగాణలో మరోసారి ఎన్నికల నగరా మోగనుంది. ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా సార్వత్రిక ఎన్నికలు పూర్తైన వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు సీఎం కేసీఆర్. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తికాగానే మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించేలా సమాయత్తమవుతున్నారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణ, బడ్జెట్ రూపకల్పనపై ప్రగతి భవన్‌లో అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికలు ముగియనండటంతో వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. జూన్‌తో మున్సిపాలిటీల పదవీకాలం ముగియనుండటంతో పురపాలక ఎన్నికలు నిర్వహించేలా ప్లాన్ సిద్ధం చేయాలన్నారు.
(మంత్రుల ప్రమాణాస్వీకారానికి హరీష్ రావు ఎలా వచ్చాడో చూడండి)..https://youtu.be/v0a9AIMXlfo
కొత్త పంచాయతీరాజ్ చట్టం మాదిరిగానే కొత్త పురపాలక చట్టాన్ని తెచ్చేందుకు సన్నాహాలు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దేశంలోని ఆదర్శ నగరాలు, పట్టణాలను సందర్శించి అక్కడి విధానాలను పరిశీలించి కొత్త చట్టంలో చేర్చాలని సూచించారు.
2019-20 రాష్ట్ర బడ్జెట్ జనరంజకంగా ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేసేందుకు నిధులుంటాయని పేర్కొన్నారు. మొత్తంగా శాసనమండలి,లోక్‌సభ,పంచాయతీ,మున్సిపాలిటీ ఎన్నికలతో రానున్న నాలుగు నెలలు అధికార,ప్రతిపక్ష పార్టీలకు కీలకంకానుంది.