రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఓటేయాలన్నారు సీఎం కేసీఆర్. హైదరాబాద్‌కు వచ్చిన యశ్వంత్‌కు ఘన స్వాగతం పలికారు సీఎం కేసీఆర్. అనంతరం జలవిహార్‌లో ఏర్పాటుచేసిన సభలో మాట్లాడిన సీఎం….రాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మప్రభోదానుసారం ఓటు వేయాలని కోరారు.
ఉత్తమ, ఉన్నతమైన వ్యక్తి రాష్ట్రపతిగా ఉంటే దేశ ప్రతిష్ట మరింత పెరుగుతుందని తెలిపారు. దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావాల్సి ఉందన్నారు. అందుకే యశ్వంత్ సిన్హాకు ఓటేయాలన్నారు. యశ్వంత్ ఉన్నత వ్యక్తిత్వంగలవారని… న్యాయవాదిగా కెరీర్‌ను ప్రారంభించారని, వివిధ హోదాల్లో దేశానికి అత్యుత్తమ సేవలందించారని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రిగా పనిచేశారని, ఆయనకు అన్ని రంగాల్లో విశేష అనుభవముందని తెలిపారు.
ప్రధాని ఇవాళ హైదరాబాద్ వస్తున్నారని తాము వేసిన ప్రశ్నలకు హైదరాబాద్ వేదికగా సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా కూడా నెరవేర్చలేదన్నారు.