ఎంపాక్స్‌ .. గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ

7
- Advertisement -

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది మంకీపాక్స. ఆఫ్రికా దేశాల్లో సాధారణంగా కనిపించే ఈ వైరస్‌.. స్వీడన్‌ ఆ తర్వాత పాకిస్థాన్‌లో మూడు కేసులు నమోదవ్వడం అందరిని ఆందోళన కలిగిస్తోంది. మంకీపాక్స్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో WHO గ్లోబల్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ఆదేశాలను జారీ చేసింది.

మంకీపాక్స్‌.. (ఆర్థోపాక్స్‌ వైరస్‌లో ఒక రకం) . డెన్మార్క్‌లో 1958లో తొలిసారిగా దీన్ని గుర్తించగా ఆ తర్వాత 1970లో మొదటిసారిగా ఓ మనిషికి ఇది సోకింది. ఆఫ్రికాలోని మారుమూల ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించేది. కానీ క్రమక్రమేణ ఈ వ్యాధి 2022 వచ్చే సరికి 116 దేశాలకు వ్యాపించింది. ఈ వ్యాధితో ఇప్పటివరకు లక్షల మంది మృతి చెందారు.

ఈ ఏడాది ఇప్పటివరకూ మొత్తం 14 వేల వరకూ మంకీపాక్స్‌ కేసులు నమోదైతే, 524 మంది మరణించారు. బురుండి, కెన్యా, రువాండా, ఉగాండా,స్వీడన్‌, పాకిస్థాన్‌ దేశాల్లో కేసులు నమోదయ్యాయి. రెండు వేరియంట్లలో ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. క్లాడ్‌-1 (కాంగోబేసిన్‌ క్లాడ్‌) తొలి వేరియంట్‌ ప్రమాదకరమైనది. నిమోనియా, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ సమస్యలకు కారణమవుతుంది. మరణాల రేటు 10 శాతం వరకూ ఉండొచ్చు. క్లాడ్‌-2 (పశ్చిమ ఆఫ్రికా క్లాడ్‌) వేరియంట్‌ తొలి వేరియంట్‌తో పోలిస్తే, కొంత తీవ్రత తక్కువగా ఉంటుంది. ఈ వేరియంట్‌ సోకిన వారిలో శరీరంపై పొక్కులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరణాల రేటు 1 శాతం కంటే తక్కువే.

వ్యాధిగ్రస్తుల చర్మంపై పొక్కులు, జ్వరం, గొంతు తడారిపోవడం, తల తిరగడం, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం సంభవించవచ్చు.

Also Read:పీజీటీఐ నూతన అధ్యక్షుడిగా కపిల్!

- Advertisement -