బడ్జెట్‌లో తెలంగాణ పదమే లేదు..

21
kr-suresh(file Photo)
kr-suresh(file Photo)
- Advertisement -

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పదమే లేదని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సురేశ్‌ రెడ్డి.. నిరుద్యోగ యువతకు ఉపాధి సహా అనేక వాగ్దానాలు చేశారన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం హామీలు అమలు చేస్తామన్నారు,కానీ తెలంగాణకు ఇవ్వాల్సినవేవీ ఇందులో లేవు అన్నారు. కనీసం తెలంగాణ అన్న మాట కూడా మంత్రి నోట పలకలేదు..కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు.

కోఆపరేటివ్ ఫెడరలిజం కనిపించలేదు. పొలిటికల్ ఫెడరలిజం మాత్రమే కనిపించిందని,జాతీయ ప్రాజెక్టుగా ఉన్న పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తామన్నారన్నారు. ఇది దేశ ఆహార భద్రతకు ఉపయోగపడుతుందని, ఇందుకు అభినందిస్తున్నాం. అలాగే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అడిగాం అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు దేశ ఆహార భద్రతను ఎన్నో రెట్లు పెంచింది,ఏఐబీపీ కింద బిహార్, అస్సాం రాష్ట్రాలకు నిధులిచ్చారన్నారు. అదే పథకం కింద కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు ఎందుకు ఇవ్వలేదు?, విభజన చట్టం షెడ్యూల్ 13లో రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలు చాలా ఉన్నాయన్నారు. అందులో ఉన్న ఏపీ ప్రాజెక్టులు ఇస్తామన్నారు…బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ సహా అనేక తెలంగాణ అంశాల ప్రస్తావన లేదు అన్నారు. ఈసారి ఏపీకి ఇచ్చాం. వచ్చే బడ్జెట్‌లో తెలంగాణకు ఇస్తామన్న మాట కూడా రాలేదు అన్నారు.

రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు,కానీ ఎవరూ కూడా ఆ మేరకు ఒత్తిడి చేయలేకపోయారన్నారు. మాట్లాడేవారు లేరు. వినేవారు లేరు. ఇచ్చేవారు లేరు అన్నట్టుగా మారింది,మాకు లోక్‌సభలో ఎంపీలు లేరు. ఈ బడ్జెట్ మనీ బిల్లు. రాజ్యసభలో ఓటింగ్ ఉండదన్నారు. అయినా సరే రాజ్యసభలో తెలంగాణ కోసం ఒత్తిడి తెస్తాం,తెలంగాణకు రావాల్సిన వాటా విషయంలో మా పోరాటం కొనసాగిస్తాం అన్నారు.

Also Read:సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఆపరేషన్ రావణ్

- Advertisement -