ప్రభుత్వం పిలవకపోయినా మా గళం వినిపిస్తాం: సురేష్ రెడ్డి

9
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ జరిగే సమావేశానికి పిలిచిన పిలువక పోయిన తెలంగాణ ఆకాంక్షల కోసం ఎప్పుడు కొట్లాడుతాం అన్నారు బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి. బడ్జెట్ మొదటి విడతలో తెలంగాణ కి రావాల్సిన వాటా పై రాజ్యసభ లో మా గళం వినిపించాం అన్నారు. కేసీఆర్ ఆదేశాల తో రేపటి నుంచి జరిగే సమావేశంలో తెలంగాణ కి నిధులు,ఇతర అంశాలపై నిరంతరం పోరాటం చేస్తాం అని తెలిపారు సురేష్ రెడ్డి.

కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీల ఎంపీలతో ఇవాళ సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వద్ద అపరిష్కృతంగా ఉన్న రాష్ట్రానికి సంబంధించిన వివిధ సమస్యలపై చర్చించనున్నారు.

కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు ఆహ్వానం అందగా తమకు లేటుగా సమాచారం వచ్చిందని అందుకే సమావేశానికి రాలేకపోతున్నామని తెలిపారు సురేష్ రెడ్డి.

Also Read:మార్చి 8న ఉమెన్స్‌ డే ..ఎందుకో తెలుసా..?

- Advertisement -