కృష్ణా నదీ జలాల బోర్డు ఛైర్మన్‌గా ఎంపీ సింగ్..

286
krmb
- Advertisement -

కృష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డు (కేఆర్ఎంబీ) ఛైర్మన్‌గా ఎంపీ సింగ్‌ ను నియమిస్తూ కేంద్ జలశక్తి శాఖ ఆదేశాలు జారీ చేసింది. కృష్ణా బోర్డు కొత్త చైర్మన్ గా నియమితులైన ఎంపీ సింగ్ సెంట్రల్‌ వాటర్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌లో హయ్యర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ గ్రేడ్‌ (HAG)గా ప్రమోట్‌ చేసి ఈనెల 1వ తేదీ నుంచి ఆయనకు కొత్త స్కేల్‌పై జీతాలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఆయన పదవీలో చేరిననాటి నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుందని కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది.

ఇంత వరకు పనిచేస్తున్న ఎం.పరమేశం స్థానంలో ఎంపీ సింగ్ ను నియమించగా ఢిల్లీలో కేంద్ర జల వనరుల శాఖా మంత్రిని ఏపీ సీఎం జగన్ ను కలసి వెళ్లిన కొన్ని గంటల్లోనే ఈ నియామకం జరగడం గమనార్హం.

- Advertisement -