- Advertisement -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. ఆలయ అధికారులు ఎంపీ సంతోష్‌కు ఘన స్వాగతం పలికి శ్రీవారి దర్శనం చేయించారు. అనంతరం శ్రీవారి ప్రసాదాలను టీటీడీ ఛైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి స్వయంగా సంతోష్‌కు అందజేశారు.
అంతకముందు కాలినడకన తిరుమలకు చేరుకున్నారు ఎంపీ సంతోష్. ఆయనతో పాటు ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస రెడ్డి, నవీన్ కుమార్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, కె. వాసుదేవారెడ్డి, నాగుర్ల వెంకన్నలు ఉన్నారు.
ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా …అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
- Advertisement -