రక్షణశాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా సంతోష్ కుమార్

263
Santosh Kumar
- Advertisement -

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలను రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు గురువారం ప్రకటించారు. ఈ కమిటీల్లో ముగ్గురు టిఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీలకు స్థానం దక్కింది. సంతోష్ కుమార్ తో పాటు లింగయ్య యాదవ్,బండ ప్రకాశ్ లకు చోటు దక్కింది.

రక్షణ శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఎంపి జోగినిపల్లి సంతోష్‌కుమార్, ఆహార, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా బడుగుల లింగయ్యయాదవ్‌,కార్మిక శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా బండ ప్రకాశ్‌లను నియమించారు.

పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి (ఎంపీల్యాడ్‌) పథకం అమలును పర్యవేక్షించే రాజ్యసభ ఎంపీ ల్యాడ్స్‌ కమిటీలో టీఆర్‌ఎస్‌ ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్‌కు చోటు దక్కిన సంగతి తెలిసిందే. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఎంపీ ల్యాడ్‌ పథకం కింద అభివృద్ధి పనులు వేగంగా సాగేందుకు ఈ కమిటీ చర్యలు తీసుకుంటుంది. 12 మంది సభ్యులు ఉన్న ఈ కమిటీలో ఏపీ నుంచి టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ కూడా ఉన్నారు.

- Advertisement -