రెండో విడత గ్రీన్ ఛాలెంజ్‌కు ఎంపీ సంతోష్ శ్రీకారం

540
green challenge
- Advertisement -

తెలంగాణకు హరితహారంలో భాగంగా టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు శ్రీకారం చుట్టిన గ్రీన్ ఛాలెంజ్‌కు విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఏడాదిలో ఇప్పటివరకు రెండు కోట్ల మొక్కలు నాటారు. ఒకరు మొక్కనాటి మరో ముగ్గురు మొక్కలు నాటి,సంరక్షించేలా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రారంభం సమయంలో తాను స్వయంగా మొక్క నాటి, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు,గవర్నర్ నరసింహన్, నటుడు నాగార్జునను నామినేట్ చేశారు. వారందరూ కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి నామినేట్ చేయగా ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.

ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా ఈ బృహత్ కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యారు. గ్రీన్ ఛాలెంజ్‌ లక్ష్యం ఒక కోటికి చేరినప్పుడు మొక్కను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాటారు. ప్రస్తుతం ఈ లక్ష్యం నేటికి రెండు కోట్లకు చేరటంతో మరో సారి ఎంపీ సంతోష్ మొక్క నాటారు. తాజాగా రెండో విడత గ్రీన్‌ ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టనున్నారు ఎంపీ సంతోష్.

- Advertisement -