మరో అవేర్‌నెస్ వీడియో షేర్ చేసిన ఎంపీ సంతోష్..

70
mp santhosh

రాష్ట్రాన్ని హరితవనంలా మార్చేందుకు సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచేందుకు ఎంపీ సంతోష్ కుమార్…గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టారు. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొంటుండగా వివిధ రంగాలకు చెందిన వారు సైతం పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు.

తాజాగా ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు మరో వీడియోని షేర్ చేశారు ఎంపీ సంతోష్. ప్రపంచవ్యాప్తంగా టిష్యూ పేపర్స్ కోసం ఎన్నో చెట్లను నరుకుతున్నామని దీని వల్ల భవిష్యత్ తరాలకు జరిగే నష్టాన్ని వివరించే ఈ వీడియోని ప్రతిఒక్కరూ చూడాలన్నారు.