గోశాలలకు గడ్డి సరఫరా చేయడంపై సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యపై ప్రశంసలు గుప్పించారు ఎంపీ సంతోష్ కుమార్. ఖమ్మం జిల్లాలోని రెండు గోశాలలకు గడ్డిని సాయంగా అందించడంపై హర్షం వ్యక్తం చేసిన సంతోష్.. మానవత్వం అంటే ఇదేనని..ఎమ్మెల్యే పిలుపుకు రైతులు స్పందించి గోశాలలకు గడ్డిని సరఫరా చేయడం గొప్ప విషయమని ట్విట్ చేశారు.
బండెనక బండి కట్టి…గోసంరక్షణకు నడుం కట్టి అంటూ ఓ పత్రికలో వచ్చిన వార్తను షేర్ చేశారు ఎంపీ సంతోష్. ఖమ్మంలో గురువారం ప్రధాన రహదారిపై గడ్డి ట్రాక్టర్లు ఇలా బారులు తీరాయి. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య రైతులు,దాతల సహకారంతో స్ధానికంగా ఉన్న రెండు గోశాలలకు 126 ట్రాక్టర్ల వరి గడ్డిని సమకూర్చారు. ఈ గడ్డిని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌తో కలిసి గోశాల నిర్వహకులకు అందజేశారు అనే కథనాన్ని ప్రచురించగా ఈ వార్తను షేర్ చేస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పనితీరును మెచ్చుకున్నారు.
Humanity at its best. Cattle & Farmers coexists for ages here. When one of them suffers, the other one bleeds. How heartening these wonderful lot of farmers respond instantaneously to the call of MLA @venkataveeraiah garu to feed few starving cattle in Khammam.#Respect#Farmers pic.twitter.com/1q797T3bsV
— Santosh Kumar J (@MPsantoshtrs) May 1, 2020