త్వరలో తడోబా టైగర్ రిజర్వ్‌లో పర్యటిస్తా:ఎంపీ సంతోష్

36
- Advertisement -

అడవికి రాజులా, అత్యంత రాజసంతో బతికే పులి రూటే సపరేటు. అడవిలో మిగతా జీవులను తన కనుసైగతో శాసించే పెద్ద పులి, తనకు ఆకలేసి నప్పుడే వేటాడుతుంది, తనివితీరా తింటుంది. కాసేపు సేదతీరేందుకు కొలనులో జలకాలాడుతుంది.

తాజాగా తడోబా టైగర్ రిజర్వ్ లో పెద్దపులి రాజసాన్ని ఎం.పీ. జోగినపల్లి సంతోష్ కుమార్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. తన మిత్రుడు కెమెరాలో బంధించిన తడోబాలో పులి ఆహారం, సేదతీరుతున్న దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయని షేర్ చేశారు.

ఆహారంగా తనకు ఇష్టమైన అడవిదున్నను వేటాడి ఇష్టంగా తినటంతో పాటు, నీళ్లలో జలకాలాడుతున్న పులి వీడియోలు, ఫోటోలు సంతోష్ పంచుకున్నారు. త్వరలోనే తానూ తడోబా టైగర్ రిజర్వ్ లో పర్యటిస్తానని తెలిపారు.

పర్యావరణ ప్రేమికుడిగా, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వహిస్తూ తన కెమెరా కన్నుల ద్వారా బంధించిన పక్షులు, ప్రకృతి చిత్రాలను ప్రతీ వారం చేయటం ఆనవాయితీగా సంతోష్ కుమార్ కొనసాగిస్తున్నారు.

Also Read:స్లిమ్ లుక్ లోకి కీర్తి సురేష్

- Advertisement -