ధన్యవాదలు సుఖేందర్ అన్నాః ఎంపీ సంతోష్‌

262
Green Challeange

ఎంపీ సంతోష్‌ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖెందర్ రెడ్డి. ఈసందర్భంగా ఆయన మరో నలుగురికి సవాల్ విసిరారు. తన సవాల్ ను స్వీకరించినందుకు గుత్తా సుఖెందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్. గ్రీన్ ఛాలెంజ్ సవాల్ ను స్వీకరించినందుకు చాలా సంతోషం అంటూ ట్వీట్ చేశారు.

కాగా ఈరోజు ఉదయం చిట్యాలలోని తన వ్యవసాయ క్షేత్రంలో మూడు మొక్కలు నాటారు గుత్తా సుఖెందర్ రెడ్డి. అనంతరం మరో నలుగురికి మొక్కలు నాటాలని సవాల్ విసిరారు. మొక్కలు నాటడం చాలా గొప్ప నిర్ణయం అన్నారు.